జగిత్యాల జిల్లా కలెక్టర్ రవి సోషల్ మీడియా వేదికగా ఓ వివాదంలో ఇరుకున్నారు. మంగళవారం హీరోయిన్ రష్మిక మందన తన లేటెస్ట్ ఫోటోలను ట్విటర్‌లో తన అభిమానులతో పంచుకుంది. అయితే ఈ ఫోటోలపై జగిత్యాల కలెక్టర్ పేరుతో వచ్చిన ట్వీట్ దుమారం రేపుతోంది. రష్మికను ఉద్దేశించి.. చించేశావ్ పో అంటూ కలెక్టర్ రవి పేరుతో వచ్చిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాధ్యతగల ఒక జిల్లా కలెక్టర్ ఈ విధంగా కామెంట్ చేయడం సంచలనం సృష్టించింది. ఈ ట్వీట్‌పై కలెక్టర్‌పై సర్వత్రా విమర్శలు వచ్చాయి. సంచలనం రేపిన ఈ ట్వీట్‌పై జగిత్యాల కలెక్టర్ రవి స్పందించారు. ఈ ట్వీట్ చేసింది తాను కాదని, తన ట్విటర్ ఖాతాను ఎవరో హ్యాక్ చేశారని కలెక్టర్ పేర్కొన్నారు. అంతేకాకుండా దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసి వెంటనే విచారణ చేపట్టాలని కోరారు. ప్రస్తుతం కలెక్టర్ ట్విటర్ అకౌంట్‌ను ఎవరు హ్యాక్ చేశారనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
‘రష్మిక చించావ్ పో’.. అది నేనన్లేదు